మీకు చాలా పనులున్నాయని మాకు తెలుసు, అందుకే ఈ Inspire అనే   తరగతులను రూపొందించాము!

ద జాన్ ఆంకర్బర్గ్ షో మీరు విశ్వాసములో ఎదగాలని ఆశిస్తుంది, గనుక మీరు విశ్వాసముతో ఎదుగుటానికి అవసరమైన వనరులను మీరెక్కడ కోరుకుంటే అక్కడ.... ఉచితముగా అందిస్తున్నాము!

about-thumb-1

మేమెందుకిలా చేస్తున్నాము?

దాదాపు 37 సంవత్సరాలుగా ద జాన్ ఆంకర్‌బర్గ్ షో కార్యక్రమము నిజమైన ప్రశ్నలకు నిజమైన సమాధానాలను అందించింది మరియు క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుతూ వచ్చింది. మా అన్ని పరిచర్యలు మరియు వివిధరకుములైన మీడియా మధ్యమాల ద్వారా బైబిలు సత్యములను ప్రకటించుటం, విశ్వాసులను బలపర్చుటం మరియు సంశయవాదులను సవాలు చేస్తూ వారి కఠినమైన వేదాంత ప్రశ్నలకు జవాబులు అందించుటమే మా ఉద్దేశము.

జాన్ ఆంకర్‌బర్గ్‌ ను కలుసుకోండి.

డా. జాన్ ఆంకర్‌బర్గ్‌ గారు, ప్రపంచము మంతటా అత్యధికముగా చూడబడుతున్న క్రైస్తవ అమెరికను కార్యక్రమైన ద జాన్ ఆంకర్‌బర్గ్‌ షో అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు. ఆయన టెలివిజను మరియు రేడియో కార్యక్రమాలు 106 లక్షల అమెరికాను ఇండ్లలో ప్రసారమౌతున్నాయి మరియు దాదాపుగా 200 దేశములలో 12 భాషలలో అందుబాటులో ఉన్నవి. ఆయన 158 పుస్తకాలకు మరియు 20 బాషలలో ముద్రించబడిన వ్యాకరణ గ్రంధాలకు రచయితగా సహరచయితగా మరియు సహకారులుగా ఉన్నారు, ఆయన రచనలు 33 లక్షలకు పైగా అమ్ముడైనవి మరియు ప్రతీ సంవత్సరము ఆన్ లైన్ ద్వారా లక్షలాది చదువరులకు చేరుతున్నవి.

about-thumb-2

మా ఉద్దేశము:

సాధ్యమైనంతగా దేవుని వాక్యమును వినాలనుకుంటున్న ప్రజలకు వాక్యమును అందించాలనే ఉద్దేశముతోనే JA Inspire వనరులను ఉచితముగా అందిస్తున్నాము. ప్రపంచమంతటా ప్రజలు బాధపడుచుండగా వీలైనన్ని విషయాలలో వారికి మంచిమార్గములో నడిపించాలని అనుకుంటున్నాము.